INDW vs NZW : సెమీస్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దంచేస్తున్నారు. స్మృతి మంధాన(75 నాటౌట్), ప్రతీకా రావల్ (58 నాటౌట్) పోటాపోటీగా బౌండరీలు బాదుతూ అర్ధ శతకాలతోరెచ్చిపోయారు. దాంతో.. 5.58తో రన్‌రేట్ టీమిండియా స్కోర్ పరుగులు పెడుతోంది. వీరిద్దరి విధ్వంసంతో 25 ఓవర్లకు భారత్ వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసింది.
ముంబైలోని డీవైపాటిల్ స్టేడియంలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన(75 నాటౌట్), ప్రతీకా రావల్ (58 నాటౌట్)చెలరేగి ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు శుభారంభిస్తూ స్కోర్ బోర్డును ఉరికిస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి మెరుపు బ్యాటింగ్‌తో సగం ఓవర్లకే భారత్ 150కి చేరువైంది. మరో పది ఓవర్లు ఇద్దరూ నిలబడితే.. అలవకోగా 300 ప్లస్ కొట్టడం ఖాయం.
𝗦𝗺𝗿𝗶𝘁𝗶 𝗠𝗮𝗻𝗱𝗵𝗮𝗻𝗮 𝗮𝗻𝗱 𝗣𝗿𝗮𝘁𝗶𝗸𝗮 𝗥𝗮𝘄𝗮𝗹 – 𝟳
Mithali Raj & Punam Raut – 7Smriti and Pratika now have the joint-most 100-run stands for an Indian pair in women’s ODIs 🤝 🔥 pic.twitter.com/MtlwGNKxC4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025
శతక భాగస్వామ్యం నెలకొల్పిన మంధాన, ప్రతీక రికార్డు బ్రేక్ చేశారు. భారత మహిళల జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక పర్యాయాలు సెంచరీ రన్స్ కొట్టిన రెండో జంటగా నిలిచారు. ప్రతీక, మంధానలు ఏడోసారి మూడంకెల స్కోర్ సాధించగా.. అంతకుముందు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పూనమ్ రౌత్ కూడా ఏడుసార్లు శతక భాగస్వామ్యం నెలకొల్పారు.