IND vs AUS : భారీ అంచలనాలతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు మరో పరాభవం ఎదురైంది. పెర్త్‌లో ఓటమి నుంచి తేరుకొని చెలరేగిపోతారనుకుంటే ప్రధాన బ్యాటర్లు తేలిపోయారు. ఆసీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ(73), శ్రేయాస్ అయ్యర్(61)లు అర్ధ శతకాలతో మెరిసినా.. బౌలర్లు ఉసూరుమనిపించారు. మాథ్యూ షార్ట్(74), కూపర్ కాన్లీ(61 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించి ఆతిథ్య జట్టుకు సిరీస్ విజయాన్ని కట్టబెట్టారు. నామమాత్రమైన మూడో వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరుగనుంది.
వర్షం అంతరాయం నడుమ సాగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు రెండో వన్డేలోనూ చేతులెత్తేసింది. టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ(0) రెండోసారి డకౌట్ కాగా.. రోహిత్ శర్మ(73), శ్రేయాస్ అయ్యర్(61)లు పోరాడారు. 118 పరుగులు జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశారు. కానీ, గత మ్యాచ్‌లో దంచేసిన కేఎల్ రాహుల్(11) విఫలమవ్వగా.. అక్షర్ పటేల్(44) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అయితే.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు.
With one game to go in Sydney, Australia take the series 🇦🇺 pic.twitter.com/BeyQ29cmeo
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025
ఛేదనలో అర్ష్‌దీప్, హర్షిత్ రానాలు ఆరంభంలోనే మిచెల్ మార్ష్(11), ట్రావిస్ హెడ్(26)లను ఔట్ చేసి ఒత్తిడి పెంచారు. కానీ, మాథ్యూ షార్ట్(74), కాన్లీ(61 నాటౌట్)లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షార్ట్ వెనుదిరిగాక.. ఓపెన్ అండతో ఇన్నింగ్స్ నిర్మించాడు కాన్లీ. వీరిద్దరూ కీలక భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా నడిపారు. అయితే.. విజయానికి 19 పరుగులు అవసరమైన వేళ ఔటయ్యాడు. అనంతరం సుందర్.. సిరాజ్ చెరొక వికెట్ తీసినా కాన్లీ కూల్‌గా ఆడాడు. ఆర్ష్‌దీప్ వేసిన 47వ ఓవర్లో రెండు బంతులకు రెండు సింగిల్స్ తీయగా.. మూడో బంతి వైడ్ కావడంతో ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలుపొంది మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ పట్టేసింది.