PAK Vs SA | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి జాతీయ టీ20 జట్టులో చోటు సంపాదించాడు. గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత బాబర్‌ను టీ20 జట్టులోకి తీసుకోలేదు. ఆసియా కప్‌లో పాక్ ఘోర వైఫల్యం తర్వాత సెలెక్టర్లు బాబార్ వైపు మొగ్గు చూపారు. అయితే, ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్‌కు మాత్రం టీ20 జట్టులో చోటు దక్కలేదు. త్వరలోనే టీ20 ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. క్రమంలో బాబర్‌కు పీసీబీ జట్టులోకి తీసుకుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్, శ్రీలంక-జింబాబ్వేతో స్వదేశంలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును ప్రకటించింది.
శ్రీలంక, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే సిరీస్‌కు కెప్టెన్‌గా సాహీన్ అఫ్రిది నాయకత్వంలో వన్డే జట్టును ప్రకటించింది. రెండు వన్డే సిరీస్‌లకు రిజ్వాన్‌ను వికెట్ కీపర్‌గా కొనసాగించారు. పాకిస్తాన్ మొదట దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొంటుంది. పాక్ వేదికగా టీ20 ముక్కోణపు సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తప్పుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 17 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో ఈ టీ20ల్లో సల్మాన్ ఆఘా స్థానంలో కెప్టెన్‌గా లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్‌ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఆసియా కప్‌లో పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో సెలెక్టర్లు ఆఘానే కొనసాగించాలని నిర్ణయించారు. షాదాబ్‌ను టీ20 జట్టులోకి కూడా తీసుకోలేదు.
పాక్ టీ20 జట్టు : సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిక్.
రిజర్వ్ ప్లేయర్స్ : ఫఖర్ జమాన్, హరిస్ రౌఫ్, సుఫియాన్ మోకిమ్.
పాక్ వన్డే జట్టు : షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసిబుల్లా, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ సజీమ్, జిహ్మద్కేస్, అయూబ్, సల్మాన్ అలీ అఘా.