IND vs SL : మహిళల వరల్డ్ కప్ సన్నాహాల్లో ఉన్న టీమిండియా(Team India) అదరగొట్టింది. ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక(Srilanka)పై ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 148 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ప్రతీకా రావల్(50 నాటౌట్), స్మృతి మంధాన(43) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. మంధాన ఔటయ్యాక హర్లీన్ డియోల్(48 నాటౌట్) సాయంతో ప్రతీకా వేగంగా ఆడి లక్ష్యాన్ని కరిగిచంది. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఈ ద్వయం అజేయంగా నిలవడంతో 29.4 ఓవర్లలోనే భారత్ జయభేరి మోగించింది.
ముక్కోణపు వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు పంజా విసిరారు. ఆతిథ్య శ్రీలంకను 9 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన ఆల్‌రౌండ్ షో కనబరిచింది. స్నేహ్ రానా(3-31), నల్లపురెడ్డి రని(2-26)లు లంక బ్యాటర్లను వణికించారు. ఓపెనర్ హాసినీ పెరీరా(30), కవిష దిల్హరి(25)లు రాణించినా మిగతా వాళ్లు చేతులెత్తేయడంతో లంక 148 కే ఆలౌటయ్యింది.
India’s top three seal a dominant win after their bowlers restricted Sri Lanka to 147 in a shortened game https://t.co/CkgMUzWHn2 #SLvIND pic.twitter.com/zKy5WAK07Y
— ESPNcricinfo (@ESPNcricinfo) April 27, 2025
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కౌర్ సేనకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ప్రతీక్ రావల్(50 నాటౌట్), స్మృతి మంధాన(43)లు విజయానికి బలమైన పునాది వేశారు. జట్టు స్కోర్ 54 వద్ద మంధానను ఇనోకా రణవీర వెనక్కి పంపింది. అయితే.. ఆ తర్వాత హర్లీన్ డియోల్(48 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో వికెట్ తీసిన లంక ప్లేయర్ల ఉత్సాహాన్ని నీరుగార్చింది. ప్రతీకతో కలిసి ధాటిగా ఆడిన హర్లీన్ 4 ఫోర్లతో చెలరేగింది. వీళ్ల మెరుపులతో భారత జట్టు మరో 9 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.