KCR | హైదరాబాద్ : 1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జోవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించాను. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయమిస్తే.. ఏప్రిల్ 27, 2001న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం పుట్టలేదు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఫలించి సొంత రాష్ట్ర కల కూడా నెరవేరింది. చీకట్లను పారదోలడానిక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక మాట చెప్పాను. ఉద్యమం నుంచి వెనక్కి మళ్లితే, ఉద్యమ జెండాను దించితే రాళ్లతో కొట్టి చంపాండని అని చెప్పి ఉద్యమాన్ని ప్రారంభించాను. ఆ తనదనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, సిద్ధిపేట ఉప ఎన్నికల్లో ప్రజలు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్యమం పురోగమించింది. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఎంతో వేదన, హింస, అణిచివేత చూశాం.. అందరికీ బాగా తెలుసు. గోదావరి, కృష్ణా నీళ్లు దక్కకకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లలాగా తెలంగాణ బిడ్డలు రోదించారు. కురువు, కాటకాలకు గురయ్యారు. పాములు, తేళ్లు కుట్టి అనాథాల్లాగా చనిపోయారు అని కేసీఆర్ తెలిపారు.