IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) జోరు కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ పోటీదారుగా మారిన ముంబై.. వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత ఓపెనర్ రియాన్ రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54)ల మెరుపులతో భారీ స్కోర్ చేసిన ముంబై.. ఆ తర్వాత ప్రత్యర్థిని 161కే ఆలౌట్ చేసింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా(4-22) తన పేస్ పవర్ చూపిస్తూ లక్నో మిడిలార్డర్ కుప్పకూల్చాడు. దాంతో, పరుగులు తేడాతో గెలుపొందిన హార్దిక్ పాండ్యా సేన ఆరో విక్టరీ ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్లో ఐదుసార్లు ట్రోఫీని ఒడిసి పట్టిన ముంబై ఇండియన్స్ దుమ్మురేపుతోంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ వరుసగా ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ రేసును ఆసక్తికరంగా మార్చేసింది. ఆదివారం వాంఖడేలో 215 స్కోర్ కొట్టి.. లక్నో సూపర్ జెయింట్స్‌ను భయపెట్టిన ముంబై.. ఆపై బుమ్రా(4-22), బౌల్ట్(3-20) రాణించడంతో జయభేరి మోగించింది.
Just Bumrah things 🤷
A yorker masterclass from Jasprit Bumrah rattled the #LSG batters 👊
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @Jaspritbumrah93 pic.twitter.com/LKpj6UATZD
— IndianPremierLeague (@IPL) April 27, 2025
ముంబై నిర్దేశించిన 216 పరుగుల ఛేదనలో లక్నోకు శుభారంభం లభించలేదు. ధాటిగా ఆడారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన ఎడెన్ మర్క్రమ్(9) .. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. 18 పరుగుల వద్ద మొదటి వికెట్ పడినా లక్నో స్కోర్ వేగం తగ్గలేదు. నికోలస్ పూరన్(27) తన మార్క్ విధ్వంసాన్ని కొనసాగించాడు. దీపక్ చాహర్ వేసిన 6వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. దాంతో, లక్నో వికెట్ నష్టానికి 60 పరుగులు స్కోర్ చేసింది. కానీ, ఆ తర్వాత బంతి అందుకున్న విల్ జాక్స్(2-18) డేంజరస్ పూరన్, పంత్(4)లను పెవిలియన్ చేర్చాడు.
2️⃣ wickets in an over for Will Jacks 👊
Ayush Badoni joins Mitchell Marsh at the crease.#LSG need 112 off 57 balls.
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/CcoEr2M1z3
— IndianPremierLeague (@IPL) April 27, 2025
వరుసగా రెండు కీలక వికెట్లు పడిన లక్నోను ఆయుష్ బదొని(35), మార్ష్(34)లు ఆదుకున్నారు. అయితే.. మార్ష్‌ను ఔట్ చేసిఈ జోడీని విడదీసిన బౌల్ట్ లక్నోను కష్టాల్లోకి నెట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లో జాక్స్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఆయుష్. ఆ కాసేపటికే ఇంప్యాక్ట్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్(24)ను బుమ్రా డగౌట్‌కు పంపాడు. అబ్దుల్ సమద్(2)ను బౌల్డ్ చేసి నాలుగో వికెట్ సాధించాడు బుమ్రా. అంతే.. అక్కడితో లక్నో ఓటమి ఖరారైంది. బౌల్ట్ 20వ ఓవర్లో దిగ్వేశ్ రథీని బౌల్డ్ చేయడంతో లక్నో 161కే ఆలౌటయ్యింది. దాంతో, 54 పరుగులతో గెలుపొందిన ముంబై పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.
వాంఖడేలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు వీరకొట్టుడు కొట్టారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్ రియాన్ రికెల్టన్(58) హాఫ్ సెంచరీతో మెరుపు ఆరంభం ఇవ్వగా.. 10 ఓవర్లకే ముంబై స్కోర్ 105కు చేరింది. అయితే.. లక్నో బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీసినా.. సూర్యకుమార్ యాదవ్(54) తనవైన షాట్లతో అలరించాడు. ఆఖర్లో నమన్ ధిర్(25 నాటౌట్), కార్బిన్ బాస్చ్(20)లు ధనాధన్ ఆడి ముంబై స్కోర్ 200 దాటించారు. అవేశ్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో ఆఖరి బంతిని నమన్ స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
Innings Break!
A power-packed batting effort from @mipaltan 👊
Will it be enough or will it go #LSG‘s way? 🤔
Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/GUntWz1Ras
— IndianPremierLeague (@IPL) April 27, 2025