Smita Sabharwal |హైదరాబాద్ : సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్మితా సబర్వాల్‌కు ప్రాధాన్యత లేని శాఖలు కట్టబెడుతారని అందరూ ఊహించినప్పటికీ.. ఆమెకు ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.
ఇక కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్మితా సబర్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న గచ్చిబౌలి పోలీసులు స్మితా సబర్వాల్‌ను విచారించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు నాడు ఆమె తెలిపారు. ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా..? చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ ప్రశ్నించిన విషయం విదితమే.