IPL 2025 : ఢిల్లీ గడ్డపై మరో ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది. 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొంటున్నాయి. కీలకమైన ఈ పోరులో టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్(Rajat Patidar) ఫీల్డింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఈ జట్ల మధ్య తగ్గపోరు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. చిన్నస్వామిలో రాహుల్ అర్ధ శతకంతో మెరవగా చిత్తుగా ఓడిన ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.
ఢిల్లీ తుది జట్టు : ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్, కరున్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ : అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, మాధవ్ తివారీ, త్రిపురన విజయ్.
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @DelhiCapitals in Match 4️⃣6️⃣
Updates ▶️ https://t.co/9M3N5Ws7Hm#TATAIPL | #DCvRCB pic.twitter.com/sBD42HkvUq
— IndianPremierLeague (@IPL) April 27, 2025
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
ఇంప్యాక్ట్ సబ్స్ : దేవ్‌దత్ పడిక్కల్, లియాం లివింగ్‌స్టోన్, రసిక్ దార్ సలాం, మనోజ్ భడంగే, స్వప్నిల్ సింగ్.