లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ కాన్వాయ్‌పైకి కొంత మంది వ్యక్తులు టైర్లు విసిరారు. (Tyres Flung At SP MP’s Convoy) ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన వల్ల కొంతమంది వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ సంఘటనపై మండిపడ్డారు. ఎస్పీకి చెందిన దళిత ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్, రాజ్‌పుత్ రాజు రాణా సంగపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై కర్ణి సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఆగ్రాలోని ఆయన ఇంటిపై దాడి జరిగింది.
కాగా, శనివారం మధ్యాహ్నం రాజ్యసభ ఎంపీ రామ్‌జీ లాల్ సుమన్ కాన్వాయ్ రోడ్డుపై వెళ్తుండగా కర్ణి సేనకు చెందిన వ్యక్తులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఆయన కాన్వాయ్‌పైకి టైర్లు, రాళ్లు విసిరారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టైర్లు విసరడం వల్ల ఆ రహదారిలో వెళ్లే కొందరు వాహనదారులు కూడా ఇబ్బందిపడ్డారు. పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎంపీపై ప్రాణాంతకమైన దాడి జరిగిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు. ప్రభుత్వం మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మద్దతుతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.
समाजवादी पार्टी के दलित राज्यसभा
सांसद रामजी लाल सुमन के काफिले पर
क्षत्रिय समाज के युवकों ने किया हमला!काफिले की गाड़ियां आपस में टकराईं,
बाल बाल बचे रामजी लाल सुमन!एक संसद भी सुरक्षित नहीं हैl
Uttar Pradesh #UttarPradesh pic.twitter.com/brbLRgNPKK
— Sameer Lohiya (@LohiyaLohiya) April 27, 2025
Breaking 🚨
यूपी के अलीगढ़ में करणी सेना और क्षत्रिय समाज के लोगों ने सपा सांसद रामजीलाल सुमन के काफिले पर टायर फेंके
जिससे हड़बड़ाहट में गाड़ियां अनियंत्रित होकर टकराईं ये सब तब हुआ, जब पुलिस कुछ ही दूर पर तैनात थी
टायर फेंकते वीडियो👇🏻 #ramjilalsuman #Aligarh #karnisena pic.twitter.com/xmyM2m25Ll
— Rinki Yadav (@Rinkiyadav04) April 27, 2025