తిరుమల : వేసవి సెలువుల కారణంగా తిరుమలలో ( Tirumala ) వీఐపీ బ్రేక్( VIP Break Darsan ) దర్శనాల సమయాన్ని మార్చారు. మే 1 నుంచి అమలులోకి వస్తుందని టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. మే 1 నుంచి ఉదయం 6 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని స్పష్టం చేసింది. మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు అమలులో ఉంటుందని వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 82,811 మంది భక్తులు దర్శించుకోగా 34,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.24 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.