Power Issue | లక్ష్మణ్ చందా మండలంలోని పీచర, ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య ఇటీవల విద్యుత్ సప్లైలో ఏర్పడిన ప్రతిష్టంబనతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఉద్రిక్తతలకు అసలు కారణం ఇది..
లక్ష్మణ్ చందా మండలంలోని పీచర గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్ స్టేషన్ను నిర్మించింది. ఈ సబ్ స్టేషన్కు అవసరమైన భూమిని పీచర గ్రామస్తులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ భూమి విలువ 30 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ సబ్ స్టేషన్ నుండి పీచర, ధర్మారం, పారుపల్లిలోని కొంత భాగం పొట్టపెళ్లి శివారులోని కొంతభాగానికి వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. పీచర గ్రామానికి ప్రత్యేకమైన సింగిల్ ఫేస్ త్రి ఫేస్ విద్యుత్తు సప్లై లైన్ ద్వారా గ్రామానికి విద్యుత్తు సరఫరా అవుతుంది.
అయితే పీచర గ్రామం లాగే తమ గ్రామానికి ప్రత్యేకమైన లైను ద్వారా సింగిల్ ఫేస్ త్రి ఫేస్ విద్యుత్ సప్లై కావాలని ధర్మారం గ్రామ ప్రజలు అధికారులను కోరారు. దాంతో వారికి విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక లైను మంజూరు చేశారు. ఇటీవల విద్యుత్తు లైను నిర్మాణ పనులను కూడా పూర్తి చేశారు. ధర్మారానికి వెళుతున్న ప్రత్యేక లైనుకు కనెక్షన్ ఇచ్చే సమయంలో పీచర గ్రామస్తులు అడ్డుకున్నారు తమ గ్రామం పూర్తి ఖర్చును భరించి సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. సబ్ స్టేషన్ నిర్మాణానికి కావలసిన భూమి ఖరీదులో కొంత భాగాన్ని ధర్మారం గ్రామస్తులు భరించి ప్రత్యేక లైనును తీసుకెళ్లాలని పీచర గ్రామస్తులు కోరారు.
కానీ ధర్మారం గ్రామస్తులు పీచర గ్రామానికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ప్రత్యేక లైన్ ద్వారా విద్యుత్తు అందించడం అడ్డుకుంటామని గ్రామస్తులు పేర్కొన్నారు. దాంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఇరు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఎస్సై శ్రీనివాస్ ఇరు గ్రామాల ప్రజలకు సూచించారు.
అభివృద్ధిలో భాగస్వాములు కానిదే ప్రత్యేక లైను ఇవ్వం : అబ్బా భూమేష్, పీచర గ్రామస్తుడు
మా గ్రామాభివృద్ధి కమిటీ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం అప్పులు చేసి నిర్మాణానికి సహాయపడింది. దాంతో అధికారులు మా గ్రామానికి ప్రత్యేక లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అలాగే ధర్మారం గ్రామానికి కూడా ప్రత్యేక లైను ఇవ్వాలంటే వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. పీచర గ్రామానికి కొంత ఆర్థిక సహాయం అందించి ప్రత్యేక లైను తీసుకెళ్లాలి.
రూపాయి ఖర్చు లేకుండా ప్రత్యేక లైను తీసుకెళ్లడం సరికాదు : తిప్పని శేఖర్
మా గ్రామస్తులం ఎంతో ఖర్చును భరించి సబ్ స్టేషన్ ను ఏర్పాటుకు సహకరించాం. ఇప్పటికే ధర్మారం గ్రామానికి విద్యుత్ సరఫరా నడుస్తుంది. ఇంకా ప్రత్యేక లైను కావాలంటే మేము భరించిన ఖర్చులో వారు కొంత భరించాలి. ధర్మారం గ్రామస్తులు ఖర్చును భరించం అని చెప్పడం సరికాదు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ