Matheesha Pathirana | టీ20ల్లో చెత్త రికార్డు.. చెన్నైని కలవరపరుస్తున్న యువ పేసర్ ఫామ్
Matheesha Pathirana : శ్రీలంక యువ పేసర్ మథీష పథిరన(Matheesha Pathirana) పొట్టి క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో పథిరన..
Matheesha Pathirana : శ్రీలంక యువ పేసర్ మథీష పథిరన(Matheesha Pathirana) పొట్టి క్రికెట్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన బౌలర్‌గా రికార్డు సాధించాడు. బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన తొలి టీ20లో పథిరన 12 ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. అందులో 9 వైడ్స్, 3 నో బాల్స్ ఉన్నాయి. అతడు అదనంగా 12 పరుగులు సమర్పించాడు. నాలుగు ఓవర్లలోనే ఒక వికెట్ తీసి 56 పరుగులు ఇచ్చాడు.
ఐపీఎల్ 17వ సీజన్ ముందు ఈ యంగ్‌స్టర్ లయ తప్పడంతో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం ఆందోళన చెందుతోంది. నిరుడు ఐపీఎల్లో పథిరణ అద్భుతంగా రాణించాడు. 12 మ్యాచుల్లో 19 వికెట్లు కూల్చాడు. యార్కర్ స్పెషలిస్ట్ అయిన అతడు డిల్లీ క్యాపిటల్స్‌పై 3/15తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు సీఎస్కే తరఫున అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

మలింగ రికార్డు బ్రేక్
ఐదు ఏండ్లగా చెక్కు చెదరని రికార్డు బద్ధలు కొట్టాడు. అఫ్గనిస్థాన్‌తో బుధవారం జరిగిన ఆఖరి టీ20లో పథిరన రెండు వికెట్లు తీసి.. ఒక టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లంక బౌలర్‌గా అవతరించాడు. దాంతో, యార్కర్ కింగ్ లసిత్ మలింగ(Lasith Malinga) పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
లసిత్ మలింగ, పథిరన

అఫ్గనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచుల పొట్టి సిరీస్‌లో పథిరన 8 వికెట్లు పడగొట్టాడు. దాంతో, మలింగ రెండో స్థానానికి పడిపోయాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మలింగ 7 వికెట్లు తీశాడు. అయితే.. 2002లో దుష్మంత చమీర కూడా ఆస్ట్రేలియాపై 7 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును సమం చేశాడు.
ఇవి కూడా చదవండి
- Srinivas Goud | మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- Traffic booth box | ట్రాఫిక్ బూత్ బాక్స్‌లో వ్యక్తి మృత దేహం.. బంజారాహిల్స్ ఘటన
- Indian Wells 2024 | ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్లో నగాల్.. భారీ ప్రైజ్‌మనీ ఖాయమేనా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

