Indian Wells 2024 | ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్లో నగాల్.. భారీ ప్రైజ్‌మనీ ఖాయమేనా..?
Indian Wells 2024 : భారతటెన్నిస్ స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్(Sumit Nagal) మరో విజయం సాధించాడు. అమెరికాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ (Indian Wells)లో బోణీ కొట్టాడు. తొలిసారి ఈ టోర్నీలో తలపడుతున్న నగాల్...
Indian Wells 2024 : భారతటెన్నిస్ స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్(Sumit Nagal) మరో విజయం సాధించాడు. అమెరికాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ (Indian Wells)లో బోణీ కొట్టాడు. తొలిసారి ఈ టోర్నీలో తలపడుతున్న నగాల్.. అమెరికాకు చెందిన స్టెఫాన్ డొస్టానిక్(Stefan Dostanic)ను చిత్తుగా ఓడించాడు. 97వ ర్యాంకర్ అయిన నాగల్ ‘వైల్డ్ కార్డ్’ ఎంట్రీ సాధించిన స్టెఫాన్ను రెండు సెట్లలో మట్టికరిపించాడు. 68 నిమిషాల పాటు సాగిన పోరులో 6-2, 6-2తో ఓడించి ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు అర్హత సాధించాడు.
దక్షిణకొరియాకు చెందిన సియాంగ్ చాన్ హాంగ్‌ను నగాల్ ఢీకొట్టనున్నాడు. ఫైనల్ క్వాలిఫయింగ్ రౌండ్‌కు చేరినందకు నగాల్‌కు 10 పాయింట్లు లభిస్తాయి. అంతేకాదు 14,400 డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో రూ.11 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024)లో సంచన విజయాలు సాధించిన నాగల్.. ‘రేస్ టు ఇండియన్ వెల్స్’ టోర్నీలోనూ అదరగొట్టాడు. దాంతో, ఈ యంగ్‌స్టర్ నేరుగా ఇండియన్ వెల్స్ టోర్నీకి క్వాలిఫై అయ్యాడు.
Monday’s Qualifying Update ⬇️
Nagal d. Dostanic 6-2, 6-2
Mochizuki d. Schwartzman 6-4, 6-3
Grenier d. Medjedovic 6-1, 6-1#TennisParadise pic.twitter.com/xpbeGFE922— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 4, 2024
ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో కజకిస్థాన్ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్(Alexander Bublik)పై నగాల్ గెలుపొందాడు. తొలి సెట్ నుంచి ధాటిగా ఆడి 6-4, 6-2, 7-6తో బబ్లిక్‌ను చిత్తు చేశాడు. ఈ విజయంతో నాగల్ మూడేండ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్ చరిత్రలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నాగల్ రికార్డు నెలకొల్పాడు. 1988లో రమేశ్ కృష్ణన్(Ramesh Krishnana) తొలిసారి ఈ ఫీట్ సాధించాడు.
ఇవి కూడా చదవండి
- Viral Video | ఆకట్టుకుంటున్న రెయిన్బో పానీపూరి స్టాల్..ఎక్కడంటే..!
- Bill Gates | డాలీ ఛాయ్‌వాలా టీస్టాల్లో బిల్ గేట్స్ ఛాయ్ పే చర్చ
- Viral Video | వృద్ధ జంట ఉత్సాహానికి నెటిజన్లు ఫిదా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

