Viral Video | వృద్ధ జంట ఉత్సాహానికి నెటిజన్లు ఫిదా
Viral Video | ప్రముఖ సోషల్ మీడియా ఛాలెంజ్ టేక్ ఏ లుక్ ఎట్ మై గర్ల్ఫ్రెండ్లో పాల్గొన్న వృద్ధ జంట సోషల్ మీడియాలో విశేష ప్రాచుర్యం పొందింది.
Viral Video | ప్రముఖ సోషల్ మీడియా ఛాలెంజ్ టేక్ ఏ లుక్ ఎట్ మై గర్ల్ఫ్రెండ్లో పాల్గొన్న వృద్ధ జంట సోషల్ మీడియాలో విశేష ప్రాచుర్యం పొందింది. వీరు వయసు కేవలం ఓ అంకె మాత్రమేనని నిరూపించారని నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ఈ వీడియోలో భర్త ఫోన్లో తన భార్య ఫొటోను చూపుతూ సంతోషంలో మునిగితేలుతున్న ఎక్స్ప్రెషన్తో కనిపిస్తారు.
ఆపై వెనుక ఆయన భార్య ఉండటం చూడొచ్చు. ఇక సంగీతానికి అనుగుణంగా వారిద్దరూ డ్యాన్స్ చేయడం యూజర్లను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోకు పెద్దసంఖ్యలో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. వృద్ధ దంపతుల ఉత్సాహం, సానుకూల దృక్పధం ప్రశంసనీయమని నెటిజన్లు మెచ్చుకున్నారు.
జీవితం పట్ల వారికున్న ఆలోచనా ధోరణి అభినందనీయమని, ప్రేమ, సంతోషం అనుభవించేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారని పలువురు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. అచమాస్ అనే డిజిటల్ క్రియేటర్ మై గర్ల్‌ఫ్రెండ్ అనే క్యాప్షన్, హార్ట్ ఎమోజీతో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 60 లక్షల మందికి పైగా వీక్షించగా, 8,00000 లైక్‌లు లభించాయి.
Read More :
Shreyas Iyer | దారికొచ్చిన శ్రేయస్.. పట్టు వీడిన ఇషాన్.. దేశవాళీలోకి స్టార్ క్రికెటర్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

