Bill Gates | డాలీ ఛాయ్‌వాలా టీస్టాల్లో బిల్ గేట్స్ ఛాయ్ పే చర్చ
Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ తన భారత పర్యటన నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో టీని ఆస్వాదిస్తూ ఆయన లోకల్ కల్చర్‌ను అనుభూతి చెందారు.
Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ తన భారత పర్యటన నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. ఈ క్లిప్‌లో టీని ఆస్వాదిస్తూ ఆయన లోకల్ కల్చర్‌ను అనుభూతి చెందారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతున్న ఈ వీడియోలో డాలీ ఛాయ్‌వాలా నిర్వహిస్తున్న టీ స్టాల్లో బిల్ గేట్స్ సందడి చేశారు.
భారత్‌లో దైనందిన జీవితంలో వినూత్నత ఉట్టిపడుతుందని ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో గేట్స్ రాసుకొచ్చారు. ఈ వీడియో క్లిప్ గేట్స్ వన్ ఛాయ్ ప్లీజ్ అని కోరుతుండటంతో ప్రారంభమవుతుంది. టీ విక్రేత ప్రత్యేకమైన బండిలో టీ ప్రిపేర్ చేసే వినూత్న పద్ధతి ఆకట్టుకుంటుందని గేట్స్ పేర్కొన్నారు.
భారత్‌కు తిరిగి రావడం పట్ల ఉద్వేగంగా ఉందని హాట్ టీని ఆస్వాదిస్తూ గేట్స్ చెబుతుండటం ఈ క్లిప్‌లో చూడొచ్చు. జీవితాలను మెరుగుపరుచుకునేందుకు భారత్‌లో ఎందరో అద్భుతమైన ఇన్నోవేటర్స్ ఉన్నారని కొనియాడారు. తేనీరును తయారుచేసే సరళమైన పనిని కూడా కళాత్మకంగా చేయడం భారతీయుల గొప్పతనమని ప్రశంసించారు. టీ విక్రేత పక్కనే నిల్చుని మరిన్ని ఛాయ్ పే చర్చల కోసం వేచిచూస్తున్నానని గేట్స్ చెప్పడంతో వీడియో ముగుస్తుంది.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

