Viral Video | ఆకట్టుకుంటున్న రెయిన్బో పానీపూరి స్టాల్..ఎక్కడంటే..!
Viral Video : దేశీ స్నాక్ అనగానే ముందుగా పానీపూరి అందరికీ గుర్తుకొస్తుంది. పానీపూరి మనలో చాలా మందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అనడంలో సందేహం లేదు.
Viral Video : దేశీ స్నాక్ అనగానే ముందుగా పానీపూరి అందరికీ గుర్తుకొస్తుంది. పానీపూరి మనలో చాలా మందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అనడంలో సందేహం లేదు. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ వీధి వ్యాపారి పానీపూరికి వినూత్న ట్విస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాడు.
బ్లాక్, పింక్, యల్లో షేడ్స్‌లో స్ట్రీట్ వెండర్ రెయిన్బో పానీపూరీలు విక్రయిస్తున్న వీడియోను వాండర్ ఈటర్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీటిని ఇండియన్ బ్లాక్బెర్రీస్, బీట్రూట్, హల్దీతో తయారుచేయడం విశేషం. ఈ వీడియోలో వీధి వ్యాపారి తన రెయిన్బో పానీపూరీల్లో ఎలాంటి కృత్రిమ రంగులు వాడలేదని చెబుతుండటం కనిపిస్తుంది. కేవలం పాలకూర, పుదీనా పానీపూరి వాటర్ కోసం వాడామని చెబుతోంది.
అహ్మదాబాద్‌లోని సర్ధార్ చౌక్‌లో శని, ఆదివారాల్లో ఈ రెయిన్బో పానీపూరి స్టాల్ అందుబాటులో ఉంటుంది. కేవలం రూ. 20కే కలర్‌ఫుల్ రెయిన్బో పానీపూరీలను ఆస్వాదించవచ్చని ఆమె చెబుతోంది. కలర్‌ఫుల్ పానీపూరీ కాన్సెప్ట్‌ను పలువురు యూజర్లు మెచ్చుకున్నారు. ఇది వినూత్న ఆలోచన..వావ్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, తాను సింపుల్ పానీపూరీలనే తీసుకుంటానని, కలర్‌ఫుల్ పానీపూరీలకు దూరమని ఓ యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Artificial Tongue | ఆర్టిఫిషియల్ టంగ్.. ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

