Artificial Tongue | ఆర్టిఫిషియల్ టంగ్.. ఇక నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్!
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఎనిమిది మరణాల్లో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లతోనే జరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు.
- కృత్రిమ జిహ్వ.. వహ్వా!
- సృష్టించిన సైంటిస్టులు
- సెన్సర్ల సాయంతో నోటి క్రిములకు చెక్
Artificial Tongue | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఎనిమిది మరణాల్లో ఒక మరణం నోటికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లతోనే జరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నోటికి సంబంధించిన వ్యాధులకు చెక్ పెట్టడానికి అమెరికా పరిశోధకులు నడుంకట్టారు. ఈ క్రమంలోనే నోటిలోని బ్యాక్టీరియా, ఫంగస్ వంటి క్రిములను గుర్తించడంతో పాటు వాటిని నశింపజేసే ఆర్టిఫిషియల్ టంగ్ (కృత్రిమ నాలుక)ను తాజాగా అభివృద్ధి చేశారు. కొత్త రుచులను గుర్తించడంతో పాటు.. ఓరల్ ఇన్ఫెక్షన్లను, డెంటల్ డిసీజెస్‌ను, క్యావిటీలను కలుగజేసే 11 రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను ఈ కృత్రిమ నాలుక క్షణాల్లో గుర్తించడంతో పాటు వాటిని నాశనం చేస్తుందని వాళ్లు తెలిపారు.
సెన్సర్ల సాయంతో పని..
సెన్సర్ల సాయంతో పనిచేసే ఈ ఆర్టిఫిషియల్ టంగ్‌ను లాలాజలంలో అసలు నాలుక చుట్టూరా సులభంగా అమర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రోగ్రామ్స్‌తో కూడిన డీఎన్ఏ ఎన్‌కోడెడ్ ఐరన్ ఆక్సైడ్ నానో పార్టికల్స్ (ఐవోఎన్పీ)తో ఈ సెన్సర్లను తయారు చేసినట్టు వెల్లడించారు. ఈ కృత్రిమ నాలుకతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని వెల్లడించారు. ఈ వివరాలు ‘ఏసీఎస్ ఐప్లెడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ఫేసెస్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

