livestocks on Roads | కోల్ సిటీ, జూలై 10 : గోదావరిఖని నగరంలో ప్రధాన రోడ్లపై పశువుల సంచారం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారుతోంది. నగర ప్రధాన చౌరస్తాతోపాటు అంతటా ఇదే సమస్య ఇబ్బంది పెడుతోంది. రోడ్లపైనే పశువులు తిష్టవేయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
నగరంలో రోడ్లపై పశువులు కనిపిస్తే వాటిని గోశాలకు తరలించాలని స్థానిక నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశించినా అధికారులు అమలు జరపడం లేదు. అటు పశువుల యజమానులు సైతం నిర్లక్ష్యంగా రోడ్లపైకి విడిచిపెడుతున్నారు. దీనితో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైకి పశువులు గుంపుగా రావడంతో పలు చోట్ల పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశువుల బెడదను నివారించాలని కోరుతున్నారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్