Monkeys Attack | హుజూరాబాద్ టౌన్, జూలై 10 : కోతుల దాడిలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన హుజూరాబాద్ పట్టణంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన బూర సుదర్శన్(68)పై 20 రోజుల క్రితం ఇంటి వద్ద కోతులు దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎంజీఎంలో చికిత్స అందిస్తుండగా కాలుకు ఇన్ఫెక్షన్ తీవ్రమై గురువారం మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
హుజూరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో సుదర్శన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తహశీల్దార్ కనుకయ్య, కార్యాలయ సిబ్బంది సుదర్శన్ మృతదేహాన్ని సందర్శించి.. అతని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోతుల దాడితోనే అర్ధాంతరంగా సుదర్శన్ తనువు చాలించాడని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకొని ప్రాణాలను కాపాడాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్