KTR | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం విద్యావేత్త, అనాధల హక్కుల కార్యకర్త సామినేని ఐరిన్ నీరజ రాణి రచించిన రెండు ముఖ్యమైన పుస్తకాలను హైదరాబాద్‌లో నందినగర్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
మొదటి పుస్తకం “ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ నేమ్, ఏ హోమ్, ఏ రైట్” (In Search of a Name, a Home, a Right) గురించి రచయిత్రి మాట్లాడుతూ.. అనాధరికం అనేది కేవలం బాల్యంతో ముగిసిపోయే దశ కాదని, అది జీవితకాల వాస్తవమని పేర్కొన్నారు. అనాధల పట్ల సమాజ దృక్పథం కేవలం సానుభూతితో కాకుండా బాధ్యతాయుతమైన పౌరసత్వంతో ఉండాలనే చర్చను ఈ పుస్తకం లేవనెత్తుతుందన్నారు.
రెండవ పుస్తకం “ది అన్ రిటన్ లెసన్స్” (The Unwritten Lessons).. ప్రస్తుత విద్యా విధానంలో లభించని కీలక జీవిత పాఠాలపై దృష్టి సారిస్తుంది. విద్యాపరమైన విజయంతోపాటు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా సమతుల్యమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
సమాజంలో పెద్దగా చర్చకు రాని అత్యంత సున్నితమైన, సామాజిక ప్రాధాన్యత కలిగిన అనాధల హక్కుల అంశాన్ని వెలుగులోకి తెచ్చిన రచయిత్రి నీరజ రాణిని పుస్తకాలను ఆవిష్కరించిన అనంతరం కేటీఅర్ ప్రత్యేకంగా అభినందించారు. ఏ బిడ్డ కూడా గుర్తింపు, రక్షణ లేకుండా పెరగకూడదని, ఇందుకోసం ప్రభుత్వం, సమాజం సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ‘ది అన్ రిటన్ లెసన్స్’ వంటి పుస్తకాలు ఎంతో అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన రచయిత్రి సామినేని ఐరిన్ నీరజ రాణి, విద్యావేత్తగా, అనాధల హక్కుల కార్యకర్తగా గత కొంతకాలంగా నిరుపేద, ఆశ్రయం లేని పిల్లల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అనాధల గుర్తింపు, దీర్ఘకాలిక రక్షణ కోసం ఆమె చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ పుస్తక రచనలు సాగాయన్నారు.
Tirupati Express | తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..మంటలను ఆర్పివేసిన సిబ్బంది
Mamata Banerjee | కోల్‌కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
Bomb Threats | ఏపీలో మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు