Fashion | ఒకప్పటి పద్ధతులు, వంటలు నేటి తరాన్ని ఆకట్టుకుంటున్నట్టే, అలనాటి దుస్తులు కూడా లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారుతున్నాయి. సంప్రదాయం, సంస్కృతి మేళవింపుతో ఆధునికతను జోడించిన డిజైన్లేమిటో చూద్దాం..
రొటీన్‌కు భిన్నంగా కాస్త ట్రెండీలుక్ జతచేసి డిజైన్ చేసిన టాప్ ఇది. రెడ్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ ప్లెయిన్ టాప్కు రౌండ్‌నెక్ ఇచ్చారు. మెడకు పట్టేలా సేమ్ కలర్ పైపింగ్ డోరీ జత చేశారు. బాటమ్ పార్ట్‌లో ప్రిల్స్ జతచేసి, కాంట్రాస్ట్‌గా చేతులకూ ప్రిల్స్ జోడించారు. టాప్కు నప్పేలా థిక్ బ్రౌన్ కలర్ లెగ్గిన్ జతచేశారు. రెండిటినీ మ్యాచ్ చేస్తూ.. చేతులు, నడుముకు జతచేసిన పైపింగ్ త్రెడ్స్ హైలైట్ అయ్యాయి.
చీరకట్టు అందమంతా కుచ్చిళ్లలోనే ఉంటుంది. ఆ అందాన్ని ఇనుమడించేలా రూపొందించినదే ఈ డ్రెస్. లైట్ బ్రౌన్ కలర్ ప్లెయిన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. బాటమ్‌లో కుచ్చిళ్లు జతచేస్తూనే యాంకిల్ లెన్త్ బాటమ్ కట్ ఇవ్వడంతో ధోతి ైస్టెల్లో ట్రెండీలుక్ వచ్చింది. టాప్ పార్ట్‌లో వీ కట్ ఇచ్చి ప్లెయిన్‌గా వదిలేయడంతో సింపుల్‌గా ఉంది. సేమ్కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో ఇచ్చిన హ్యాండ్స్ హైలైట్ అయ్యాయి.
మోడల్ అండ్ డిజైనర్
డి.విద్య, సిరిసిల్ల
HR the designer studio 9010940078
Unfinished Jewelry | చివర్లను కలపకుండా సగంలో వదిలేయడమే ఇప్పుడు ఫ్యాషన్”
హైదరాబాదీ కళలను ఆకట్టుకుంటున్న ఈ అరబిక్ డిజైన్స్ గురించి తెలుసా”
Ice Cream Fashion | ఐస్‌క్రీమ్ తినేందుకే కాదు.. ఈ వేసవికిదే హాటెస్ట్ కూల్ ట్రెండ్ !!”
Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!”
“Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..”