సియోల్, జూలై 28: తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ ఆరోపించారు. అమెరికా ఇలాగే కవ్వింపు చర్యలకు పాల్పడితే అణుబాంబులకు పనిచెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏ సమయంలోనైనా అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.