లండన్ : బ్రిటన్‌లో లాక్డౌన్ ఎత్తివేయడంతో సాధారణ జన జీవనం ప్రారంభమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పబ్‌లు, రెస్టారెంట్లకు వచ్చి ఎంజాయ్ చేశారు. విమానాశ్రాయాల్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. దాదాపు ఐదు నెలల తర్వాత బ్రిటన్ మొత్తం లాక్డౌన్ ఎత్తివేశారు. 6.76 కోట్ల జనాభాతో ఉన్న బ్రిటన్‌లో చాలా బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, థియేటర్లు జనంతో నిండిపోయి కలకలలాడాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఎంజాయ్ చేయడానికి వీధుల్లోకి వస్తున్నారు.
మరోవైపు, పరిస్థితులు నార్మల్ లైఫ్‌కు రావడంతో చాలా మంది సెలవులను జరుపుకునే మూడ్‌లో ఉన్నారు. బ్రిటన్ లోని అత్యంత రద్దీ విమానాశ్రయమైన హీత్రో, గెట్విక్ జనంతో రద్దీగా ఉన్నాయి. ప్రజలు 8-10 గంటలు క్యూలలో నిలబడాల్సి వస్తున్నది. ఇన్నిరోజుల పాటు ఇంటి పట్టునే ఉండి అన్‌లాక్ చేయడంతో తమకు ఇష్టమైన ప్రాంతాల్లో కుటుంబంతో గడిపేందుకు ప్రజలు వెళ్తున్నారు. దాంతో అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. హీత్రో, గెట్విక్ విమానాశ్రయాల నుంచి 340 విమానాలు సోమవారం ప్రయాణించాయి. వీరిలో 9 రోమ్, 21 పారిస్, 26 న్యూయార్క్‌కు బయల్దేరాయి.
ఇలా ఉండగా, అమెరికా, బ్రిటన్ దేశాల కోసం కొత్త రకం నిబంధనలు తీసుకొచ్చే ఆలోచనలో యురోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. వీరికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, క్వారంటైన్, వైరస్ నెగెటివ్ రిపోర్ట్ వంటివి తప్పనిసరి కాదని ఈయూ స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఇంతకాలం మూసివేసిన వ్యాపారాలు జోరుగా సాగుతాయని ఈయూ భావిస్తున్నది.
కాగా, ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రియా దేశాలు ఇవాల్టి నుంచి లాక్డౌన్ ఎత్తివేయనున్నాయి. 6 నెలల తర్వాత ఫ్రాన్స్ తెరుచుకుంటుంది. ఇందుకోసం వ్యాపారవేత్తలు పూర్తి సన్నాహాలు చేసుకున్నారు. అయితే, ఫ్రాన్స్‌లో కొన్ని ఆంక్షలు కొనసాగుతాయి. రాత్రి 9 గంటల నుంచి ఇక్కడ కర్ఫ్యూ ఉంటుంది. అదనంగా, డెన్మార్క్ , ఆస్ట్రియాలో బహిరంగ ప్రదేశాలు తెరుస్తారు. నెగెటివ్ రిపోర్ట్ చూపిన తర్వాతే ప్రవేశం లభిస్తుంది. టీకాలు తీసుకున్న అంతర్జాతీయ పర్యాటకులు కూడా వచ్చేందుకు అనుమతిస్తారు.
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్‌ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శర్మకు చోటు
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ
బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..