హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : శాసనసభ ఆవరణలో అసెంబ్లీ మార్షల్స్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో సస్పెండ్ అయిన తర్వాత అసెంబ్లీ కారిడార్లలోని శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించా రు. మార్షల్స్ బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి అడ్డుగా నిలబడి కా ర్యాలయంలోకి వెళ్లేందుకు వీళ్లేదని చెప్పారు.
ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తే సరైన సమాధానం లేదు. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.