బెంగాల్లో ఎన్నార్సీ అమలుకు ప్రణాళికలు లేవు : విజయ్ వర్గియా
పశ్చిమ బెంగాల్లో ఎన్నార్సీ అమలుకు ప్రణాళికలేవీ లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియ చెప్పారు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎన్నార్సీ అమలుకు ప్రణాళికలేవీ లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియ చెప్పారు. అయితే, పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ) ను అమలుచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఎన్నార్సీని అప్డేట్ చేస్తుందని, తద్వారా ప్రజల పౌరసత్వ హక్కులను హరించుకుంటుందని ప్రతిపక్ష వాదనలను ఏక మొత్తంగా తిప్పికొట్టారాయన.
‘పశ్చిమ బెంగాల్లో ఎన్నార్సీని అమలుచేసే ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. అయితే, సీఏఏను అమలుచేయాలని అనుకుంటున్నది. ఎందుకంటే పొరుగు దేశాలలో మతపరమైన హింస నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చిన శరణార్థులకు హక్కులు కల్పించాలని తమ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా.. ఎన్నికల అనంతరం సీఏఏను అమలు చేయడానికి మాత్రమే ఎదురు చూస్తున్నామని స్పష్టం చేశారు. హింసకు గురైన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నందున.. ఇది మాకు ముఖ్యమైన సమస్య అని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా ఎన్నార్సీని చేపట్టే ఆలోచనగానీ, ప్రణాళికగానీ మాకు లేదు అని ఆయన పునురుద్ఘాటించారు.
కొత్త పౌరసత్వ చట్టం అమలుతో భారతదేశంలో 1.5 కోట్లకు పైగా ప్రజలకు, ఒక్క
పశ్చిమ బెంగాల్లోనే 72 లక్షలకు పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ శిబిరానికి వ్యతిరేకంగా టీఎంసీ తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందని ఆరోపిస్తూ.. చాలా మందికి ప్రయోజనం చేకూర్చే సీఏఏను రాష్ట్రంలోని అధికార పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని 64 ఏండ్ల నాయకుడు ఆశ్చర్యపోయారు.
‘మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల కమిషన్ పాక్షికంగా పనిచేస్తుందని ఎన్నడూ భావించలేదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఎన్నికల్లో గెలిచినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఓటమిని గ్రహించడం ప్రారంభించిన తర్వాత ఈసీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నిందిస్తున్నారు’ అని విజయ్‌వర్గియా అన్నారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తామన్న అజ్జూ భాయ్
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్‌కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
రైతులకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మమ్మల్ని శిక్షిస్తోంది: కేజ్రీవాల్
స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CAA
- No Plans
- NRC
- Vijayvargiya
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

