నిడమనూరు, సెప్టెంబర్ 17 : నిడమనూరు మండల పరిధిలోని గౌండ్లగూడెంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చొరవతో మంజూరైన నూతన బోరు మోటార్‌ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం బుధవారం ప్రారంభించారు. 40 ఇండ్లకు నీరందించే బోర్ మోటార్ ఇటీవల మరమ్మతుకు గురైంది. మార్కెట్ చైర్మన్ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో నూతన బోర్ మోటార్ మంజూరు చేయించారు. అంతకు ముందు స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కె.వి.అరవింద్, సీహెచ్ఓ రమేశ్, సూపర్వైజర్ మేరీ స్టెల్లా, నాయకులు కొండా శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, చర్క శ్రీను, మెరుగు శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.