నల్లగొండ, సెప్టెంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి లాంటి ఎందరో గొప్ప నాయకులు.. తెలంగాణ సాయిధ పోరాటాల ద్వారా.. మరెందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా రాచరిక వ్యవస్థ నుండి.. ప్రజాస్వామ్యం వైపు నడిపించిన గొప్ప రోజు అని కీర్తించారు. త్యాగధనుల స్ఫూర్తితోనే తొలి దశ, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగసి ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. నేడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ నియంత పాలనతో ముందుకెళ్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, జేఏసీ జి వెంకటేశ్వర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్.ఓ.మాలే శరణ్య రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, కాంచనపల్లి రవీందర్రావు, కొండూరి సత్యనారాయణ, కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, పార్టీ తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలాల అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, దేప వెంకట్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మారగొని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి, దండంపెల్లి సత్తయ్య, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పల్లె రంజిత్ కుమార్, అశోక్ కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, అలుగుబెల్లి వెంకట్ రెడ్డి, గుండెబోయిన జంగయ్య, కోట్ల జయపాల్ రెడ్డి, కన్నెబోయిన నగేశ్, తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, కంచర్ల విజయ రెడ్డి, దొడ్డి రమేశ్, కుందూరు ప్రవీణ్ కుమార్, వింజమూరు లక్ష్మణ్, తగుళ్ల శీను, కొత్తపల్లి పిచ్చయ్య పాల్గొన్నారు.
Nalgonda : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్