Nemmadi Shravan kumar | డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని బడా గణేష్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమాలకు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు నెమ్మది శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహాలకు పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా నెమ్మది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు రాజ్యాంగంతో సమానత్వ హక్కులను ప్రసాదించిన గొప్ప దార్శనికులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. సమాజంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కును కల్పిస్తూ పాలకుల ఎన్నిక, ప్రభుత్వాల ఏర్పాటులో దేశ పౌరులను భాగస్వామ్యం చేస్తూ ఇచ్చిన ఓటు అనే హక్కును అందించింది అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు గజ్జల ఆనంద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Ambedkar Jayanti | తెలంగాణభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్