బిగ్‌బాస్ ఫేం నందినీరాయ్ (Nandini Rai) సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటుందో నెటిజన్లు, ఆమె ఫాలోవర్లకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో కొత్తకొత్త లుక్స్‌లో కనిపిస్తూ అందరి మతులు పోగొడుతుంది. ఎంత సెలబ్రిటీని అయినా తనకు దైవ చింతన మాత్రం ఎక్కువేనంటోంది నందినీరాయ్. ఈ భామ తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసిన వీడియోనే అందుకు ఉదాహరణ.
నందినీ రాయ్ తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మెట్ల మార్గంలో మోకాళ్లపై ఏడుకొండలపైకి చేరుకొని.. తిరుమలేశుడిని దర్శించుకుంది. అద్బుతమైన అనుభవం..దేవుడికి కృతజ్ఞతలు చెప్పలేకుండా ఉండలేకపోతున్నా.. మోకాళ్లపై కొండపైకి వెళ్లి గోవిందుడి ఆశీస్సులు పొందానంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది నందినీరాయ్. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 2తో తెలుగులో ఫాలోవర్లను సంపాదించుకుంది నందినీరాయ్.
ఈ భామ తెలుగులో మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజనీ చిత్రాల్లో నటించింది. వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో గాలివాన వెబ్ సిరీస్ కూడా చేసింది. స్పెషల్ సాంగ్‌లో కూడా మెరిసింది నందినీ రాయ్. ఈ హైదరాబాదీ భామ తెలుగుతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.