బిగ్ బాస్ సీజన్ 4 షోతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది దివి వైద్య (Divi Vadthya). చూపులతో మాయ చేసే అందం దివి సొంతం. ఈ భామ నెట్టింటో ఫొటో పెట్టిందంటే చాలు కామెంట్లు, లైక్‌ల సంఖ్య లెక్కపెట్టడం కష్టమే. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన గాడ్ ఫాదర్లో మెరిసింది దివి.
గాడ్ ఫాదర్లో పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఎప్పుడూ ఏదో ఒక హాట్, ట్రెండీ స్టిల్స్‌తో నెట్టింటిని షేక్ చేసే దివి..ఇపుడు స్టైలిష్ లుక్‌లో అందాలు ఆరబోస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. దివి వయోలెట్ కలర్ కాస్ట్యూమ్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది.
సిల్వర్ బ్రేస్లెట్, గోల్డ్ చైన్, షూస్‌తో సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. తాజా ఫొటోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఆఫర్లు దివి తలుపు తట్టడం ఖాయం అనిపిస్తోంది.