Allu Aravind | మనుషుల కూతలు రికార్డు చేసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం అద్బుతం.. కాంతార సినిమాపై అల్లు అరవింద్
కాంతార సినిమాను ఇంతలా ఆదరించినందుకు అందరికీ నమస్కారం పెట్టేందుకు మీ ముందుకు వచ్చామన్నారు నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind). కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన చిత్రం కాంతార (Kantara). తెలుగులో గీతాఆర్ట్స్ విడుదల చేసింది.
కాంతార సినిమా విడుదల కాకముందు ఓ సారి చూడండి అని చెప్పాం. ఈ సినిమాను ఇంతలా ఆదరించినందుకు అందరికీ నమస్కారం పెట్టేందుకు మీ ముందుకు వచ్చామన్నారు నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind). కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కాంతార’ (Kantara). తెలుగులో గీతాఆర్ట్స్ విడుదల చేసింది. ఈ చిత్రం తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు, టీంతో కలిసి సక్సెస్ మీట్‌కు హాజరయ్యారు నిర్మాత అల్లు అరవింద్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాకు భాషా సరిహద్దు లేదు..ఒక ఎమోషన్ బారియర్ మాత్రమే ఉంటుంది. ఏ ఎమోషన్‌తో సినిమా తీశారో జనం ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయిపోతారు. మట్టిలో నుంచి పుట్టిన కథ ఇది. ఎక్కడి నుంచో ఇంగ్లీష్ సినిమా చూసో..యూరప్ సినిమా చూసో, కొరియన్ సినిమా చూసో కథ రాసి తీసిన సినిమా కాదిది. అదే మట్టిలో పుట్టి..ఆయన వాళ్ల ఊరిలో చూసిన కొన్ని విశేషాలను ఈకథలోకి తీసుకొచ్చి..తన ఊళ్లో ఫీలైన ఎమోషన్‌ను కథలోకి తీసుకురావడం వల్ల ఆ కనెక్ట్ ఉంటది. సినిమా చూసిన తర్వాత విష్ణు తత్వం, రౌద్రరూపం కలిపి మన వైజాగ్ దగ్గరున్న సింహాచలం కథలా అనిపించిందన్నారు అల్లు అరవింద్.
అంజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. సినిమాలో ఇదివరకెపుడూ వినని డిఫరెంట్ కోరస్ సౌండ్స్ కొన్ని మ్యూజిక్‌తో కలిపి బ్యాక్ గ్రౌండ్లో వస్తాయి. ఆదేంటని మ్యూజిక్ డైరెక్టర్‌ను అడిగా. ఊళ్లో జాతరలు జరిగేటపుడు మనుషులు కూసే కూతలు రికార్డు చేసుకొచ్చి..మ్యూజిక్‌తో కలిపి చూపించినట్టు ఆయన చెప్పాడు. అందువల్లే సినిమాలో అద్భుతమైన ఎఫెక్ట్ వచ్చిందని చెప్పుకొచ్చారు.
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్‌కు సంబురాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

