Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
స్వాతిముత్యం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న గణేశ్ రెండో సినిమా నేను స్టూడెంట్ సర్ (Nenu Student Sir) తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
స్వాతిముత్యం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh) . వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. స్వాతిముత్యం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న గణేశ్ రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్ (Nenu Student Sir) ‘తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో ఆర్ఆర్ఆర్ యాక్టర్ సముద్రఖని (Samuthirakani) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సముద్రఖని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి అర్జున్ వాసుదేవన్‌గా పోలీసాఫీసర్ పాత్రలో సముద్రఖని నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో అవంతిక దస్సానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ‘నాంది’ ఫేం సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అనిత్ మధాడి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. సముద్రఖని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా పోలీసాఫీసర్‌గా నటించాడు.
The Man with unbound versatility & Supreme Talent ❤️🔥@thondankani Reporting as
ARJUN VASUDEVAN👮♂️from #NenuStudentSir!#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #Rakhiuppalapati @mahathi_sagar @ChotaKPrasad @Mee_Sunil pic.twitter.com/wRgRooD401— 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) October 18, 2022
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
Read Also : Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

