Sardar Movie | ‘విరుమన్’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు కార్తి. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సర్దార్’ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం అటు తమిళంలో, ఇటు తెలుగులో వరుసగా ప్రమోషన్లు జరుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపుర్‌లో మంగళవారం గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. కాగా ఈ వేడుకకు గెస్ట్‌గా నాగార్జున రానున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. వీరిద్దరూ గతంలో ‘ఊపిరి’ సినిమాకు కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడీయోస్ బ్యానర్‌పై నాగార్జున రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తి పలు విభిన్న గెటప్స్‌లలో కనిపించనున్నాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.
Get Ready to welcome Team #Sardar to our very own #Hyderabad for the Grand Pre-Release Event on 19th Oct, 4PM🤩
King @iamnagarjuna as chief guest💥
📍Daspalla Convention, 1st Floor, HYD
🎟️https://t.co/awuIMV6ssU@Karthi_Offl @RaashiKhanna_ @rajishavijayan @Psmithran pic.twitter.com/4svjsmmyOK— Shreyas Media (@shreyasgroup) October 18, 2022
Read Also:
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
‘లైగర్’ తర్వాత మార్పు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు నో చెప్పిన విజయ్..!
Rc15 | శంకర్-రామ్‌చరణ్ మూవీలో సీనియర్ స్టార్ హీరోయిన్?
TIGER-3 | సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ ఆ భాషల్లో కూడా రిలీజ్ కానుందా?