Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
Sardar Movie Promotions | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. 'యుగానికి ఒక్కడు' సినిమా నుండి ఇటీవలే విడుదలైన 'పొన్నియన్ సెల్వన్' వరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి.
Sardar Movie Promotions | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి ఇటీవలే విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ వరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో కార్తికు టాలీవుడ్ టైర్2 హీరోలకున్నంత క్రేజ్ ఉంది. అయితే ‘ఖైదీ’ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ‘విరుమన్’,’PS-1′ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించాడు. కాగా ఇప్పుడు ‘సర్దార్’తో సందడి చేయడానికి ముస్తాబవుతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా ప్రమోషన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ప్రమోషన్లో భాగంగా కార్తి సినిమా విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కార్తికు దర్శకత్వం చేయాలని ఆలోచన ఉందని, తొలి చిత్రాన్ని తన అన్నయ్య సూర్యతో చేస్తానని చెప్పాడు. ఎందుకంటే సూర్య తనను బాగా అర్ధం చేసుకుంటాడని, తప్పు చేస్తే అక్కడే చెప్తాడని వెల్లడించాడు. కాగా కార్తి, సూర్య హీరోగా నటించిన ‘యువ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కార్తి నటించిన ‘సర్దార్’ అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ‘అభిమన్యుడు’, ‘హీరో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన పీ.ఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో కార్తి డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడీయోస్ బ్యానర్‌పై నాగార్జున రిలీజ్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

