TIGER-3 | సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ ఆ భాషల్లో కూడా రిలీజ్ కానుందా?
TIGER-3 Movie | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. 2019లో వచ్చిన 'భారత్' తర్వాత ఇప్పటివరకు ఈయనకు హిట్టు లేదు. అయితే ఫలితం ఎలా ఉన్నా సల్మాన్‌ఖాన్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు.
TIGER-3 Movie | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఒక భారీ హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. 2019లో వచ్చిన ‘భారత్’ తర్వాత ఇప్పటివరకు ఈయనకు హిట్టు లేదు. అయితే ఫలితం ఎలా ఉన్నా సల్మాన్‌ఖాన్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘గాడ్‌ఫాదర్’లో కాసేపు మెరిసాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘టైగర్-3’ ఒకటి. టైగర్ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.
చిత్రబృందం తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ పోస్టర్లను రిలీజ్ చేసింది. దీంతో ఈ ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్నట్లు క్లారిటీ వచ్చింది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తుంది. గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్, టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక సల్మాన్ దీనితో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో షారుఖ్ పటాన్‌లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

