‘లైగర్’ తర్వాత మార్పు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు నో చెప్పిన విజయ్..!
Vijay Devarakonda | కెరీర్ లో ఒక్కసారి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరుగుతుంది. నిజానికి ఈయనకు గతంలో కూడా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి.
Vijay Devarakonda | కెరీర్ లో ఒక్కసారి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటారు. ‘లైగర్’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరుగుతుంది. నిజానికి ఈయనకు గతంలో కూడా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. కానీ అప్పుడు ఆ సినిమాలు రౌడీ హీరో కెరీర్‌పై మరీ అంత ఎక్కువ ప్రభావం అయితే చూపించలేదు. లైగర్ మాత్రం అలా కాదు.. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు విజయ్ దేవరకొండ. మూడేళ్ళు.. పూరి ఏం చెప్తే అది చేశాడు. కథపై నమ్మకంతో దేశమంతా తిరిగి ప్రమోషన్ చేశాడు. లైగర్ తేడా కొడుతుందని ఒక్కసారి కూడా అనుకోలేదు విజయ్. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ అయింది.
లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండలో చాలా మార్పులు వచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈయనకు ‘లైగర్’ కంటే ముందు ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రూపంలో మరో రెండు డిజాస్టర్స్ ఉన్నాయి. అయినా కూడా విజయ్ పెద్దగా ఫీల్ కాలేదు. కానీ 100 కోట్ల బిజినెస్ చేసిన లైగర్ సినిమా.. కనీసం 35 కోట్లు కూడా వసూలు చేయకపోవడంతో విజయ్ మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. అందుకే ఇక మీద కథలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు రౌడీ బాయ్. ఎంత పెద్ద దర్శకుడైనా.. అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా కథ నచ్చితే కానీ ముందుకెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాడు.
ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల కింద ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథకు విజయ్ నో చెప్పాడని తెలుస్తోంది. కథలో కొన్ని లోపాలు ఉండడంతో.. తాను చేయలేనని సున్నితంగా తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు మరో రెండు మూడు కథలకు కూడా విజయ్ దేవరకొండ ఈ మధ్య నో చెప్పాడు. దానికి తోడు పూరి జగన్నాథ్ ‘జనగణమన’ సినిమాను ఉన్నపలంగా ఆపేశాడు. లైగర్ ముందు వరకు ఈ స్క్రిప్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న విజయ్.. ఇప్పుడు మాత్రం లేడు. పైగా పూరి జగన్నాథ్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్టును మరికొన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశాడు.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న విజయ్.. ఆ తర్వాత ఏ సినిమా ఫైనల్ చేయలేదు. అది విడుదలై దాని ఫలితం చూసిన తర్వాతే నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నాడు. ఒకటి మాత్రం నిజం.. మునపటిలా విజయ్ దేవరకొండను ఇప్పుడు సాదాసీదా కథతో ఒప్పించడం చాలా కష్టం. మరి ఈ మార్పు విజయ్ కోరుకున్న విజయాన్ని తీసుకొస్తుందా? లేదా? చూడాలి.
Read Also:
Allu Aravind | ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?
నిజ జీవిత సంఘటనల ఆధారంగా మహేష్-రాజమౌళి సినిమా తెరకెక్కనుందా.. వామ్మో ఇదేం ట్విస్ట్?
Agent Movie | సంక్రాంతికి ‘ఏజెంట్’ వస్తున్నాడా?
Karthi | మెగాఫోన్ పట్టనున్న కార్తి.. తొలి సినిమా ఆ స్టార్ హీరోతోనేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

