SSMB29 Based on Real life incidents | మహేష్ అభిమానులే కాదు, సినీ సెలబ్రెటీల సైతం ‘SSMB29’ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఉన్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, వెండితెరపై మహేష్‌ను ఎలా చూపిస్తాడో అని క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేష్ ప్రపంచం మొత్తం ట్రావెల్ చేసే వాడిగా కనిపించనున్నట్లు జక్కన్న ఇదివరకే వెల్లడించాడు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ను రచయిత కేవి. విజయేంద్ర ప్రసాద్ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకొని తెరకెక్కునున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఇదొక అడ్వేంచర్ చిత్రం అని, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని పేర్కొన్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రాన్ని కే.ఎల్‌నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ లెవల్లో నిర్మించనున్నాడట. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో ఏకకాలంలో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత మిగితా భాషల్లో డబ్ చేస్తారట. మహేష్‌కు జోడీగా దీపికా పదుకొనేను హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
Read Also:
Allu Aravind | ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?
పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!
Agent Movie | సంక్రాంతికి ‘ఏజెంట్’ వస్తున్నాడా?
Balakrishna | బాలకృష్ణ సెలబ్రెటీ క్రష్ ఎవరో తెలుసా?