పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!
Hansika Motwani | చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందింది హన్సిక మొత్వాని. 'దేశముదురు', 'మస్కా', 'బిల్లా', 'కందిరీగ' వంటి సినిమాలతో హన్సిక తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
Hansika Motwani | చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందింది హన్సిక మొత్వాని. ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి సినిమాలతో హన్సిక తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అయితే గత కొంత కాలంగా ఈమెకు గుర్తింపునిచ్చే పాత్రలు రావడం లేదు. దాంతో ప్రేక్షకులలో హన్సికపై క్రేజ్ తగ్గింది. అయినా కాని చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ కాబోతుంది.
హన్సిక మొత్వాని త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. ఈ ఏడాది డిసెంబర్ చివర్లో ఈమె పెళ్ళి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే వరుడు ఎవరా అన్నది హన్సిక కుటుంబికులు సీక్రెట్‌గా ఉంచారు. జైపుర్‌లోని ముందోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్‌లో ఘనంగా పెళ్ళి చేసుకోబోతుందట. ఇప్పటికే గెస్ట్‌ల కోసం రూమ్‌లను అలంకరణ చేస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వెడ్డింగ్‌కు రాబోతున్నట్లు టాక్. ఇక హన్సిక ఇటీవలే నటించిన ‘మహా’ రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఇప్పటివరకు హన్సిక తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి 50 వరకు సినిమాల్లో నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

