Allu Aravind | ఆ ఇద్దరు స్టార్ హీరోలతో అల్లు అరవింద్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..?
Allu aravind | టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఈయన స్థాపించిన గీతాఆర్ట్స్ సంస్థ దక్షిణాదిన అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా రాణిస్తుంది. అల్లు అరవింద్ నుండి సినిమా వస్తుందంటే అది మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది.
Allu aravind | టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఈయన స్థాపించిన గీతాఆర్ట్స్ సంస్థ దక్షిణాదిన అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా రాణిస్తుంది. అల్లు అరవింద్ నుండి సినిమా వస్తుందంటే అది మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకుల్లో ఓ భావన ఉంది. ఇప్పటీకే ఈయన ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. ఇక గతేడాది ‘ఆహా’ పేరుతో ఓటీటీ ఫ్లాప్ ఫామ్‌ను స్థాపించి, అందులోను దిగ్విజయంగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. మొదటి రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అల్లు అరవింద్‌కు లాభాల పంట పండిస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అరవింద్‌కు ఆ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ చేయాలనుందని వెల్లడించాడు.
ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు అనుకుంటున్నారా? వాళ్లు మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్. ఇటీవలే ఓ టాక్ షోలో బన్నీ,చరణ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని తెలిపాడు. అంతేకాకుండా పదేళ్ళ క్రీతమే ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలిపాడు. ప్రతీ ఏడాది ఆ టైటిల్‌ను రిన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో చరణ్, బన్నీ కలిసి ఎవడు అనే సినిమా చేశారు. అయితే అందులో బన్నీ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
Read Also:
Balakrishna | బాలకృష్ణ సెలబ్రెటీ క్రష్ ఎవరో తెలుసా?
Agent Movie | సంక్రాంతికి ‘ఏజెంట్’ వస్తున్నాడా?
Drishyam-2 | ఆసక్తి రేపుతున్న అజయ్ దేవగన్ ‘దృశ్యం-2’ ట్రైలర్
Prince Movie | ‘ప్రిన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పాన్ ఇండియా హీరో?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

