Agent Movie Release Date | ‘అఖిల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు మొదటి సినిమానే తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన ‘హలో’ ప్రేక్షకుల ప్రశంసలు పొందిన.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ‘మిస్టర్ మజ్ను’ సినిమా అయితే వారంలోపే దుకాణం సర్ధేసింది. ఆ సమయంలో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ భారీ విజయాన్ని అందించింది. గతేడాది దసరాకు రిలీజై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అఖిల్ అదే జోష్‌తో ‘ఏజెంట్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘ఏజెంట్’ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘చిరు154’ పోస్ట్ ప్రొడక్షన్లకు ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుందట. ఈ క్రమంలోనే సినిమా విడుదల ఆలస్యమయ్యేలా ఉందని సమాచారం. దాంతో సంక్రాంతి బరిలో ‘ఏజెంట్’ సినిమాను లైన్లోకి తీసుకురావాలని అనీల్ సుంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా సంక్రాంతికి ఇప్పటికే ‘ఆదిపురుష్’, ‘వారసుడు’ డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు బాలయ్య కూడా సంక్రాంతికే రానున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఏజెంట్ చిత్రం అఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుంది. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ,మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు జరుపుతున్నారు. నిజానికి ఈ చిత్రం అగస్టు 12నే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయింది.
Read Also:
Nani | మరో కొత్త దర్శకుడిని లైన్లో పెట్టిన నాని?
Balakrishna | బాలకృష్ణ సెలబ్రెటీ క్రష్ ఎవరో తెలుసా?
Dasara Movie | బరాత్‌లో రచ్చ చేస్తున్న ‘మహానటి’.. ‘దసరా’ నుండి కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్ రిలీజ్
Varasudu | ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా?