Dasara Movie | బరాత్‌లో రచ్చ చేస్తున్న ‘మహానటి’.. ‘దసరా’ నుండి కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్ రిలీజ్
Keerthisuresh As Vennela | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన అగ్ర కథానాయికగా కొనసాగుతున్న నటి కీర్తి సురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ చిత్రంతో కీర్తీ సురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విజయంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
Keerthisuresh As Vennela | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన అగ్ర కథానాయికగా కొనసాగుతున్న నటి కీర్తి సురేష్. ‘నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో కూడిన అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది. ‘మహానటి’ చిత్రంతో కీర్తీ సురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా విజయంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కీర్తి కూడా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది. కానీ అక్కడే ఆమె పెద్ద పొరపాటు చేసింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని కథల గురించి ఆలోచించకుండా సినిమాలను చేసింది. అవి కాస్త ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఇక చాలా కాలం తర్వాత ‘సాని కాదియం’, ‘సర్కారు వారి పాట’తో వరుసగా రెండు హిట్లను సాధించింది.
ప్రస్తుతం ఈమె మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచింది. అందులో ‘దసరా’ ఒకటి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సోమవారం కీర్తి సురేష్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఈమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే పాత్రలో నటిస్తుంది. కీర్తి.. పెళ్లి కాస్ట్యూమ్‌లో బరాత్‌లో చిందులెస్తున్నట్లు పోస్టర్లో ఉంది. ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తుంది.
గ్రామీణ నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. మొదటి సారి నాని ఫుల్ లెంగ్త్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లోనే కాదు, సినీ సెలబ్రెటీల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తుంది.
Introducing @KeerthyOfficial as 'Vennala' from #Dasara ❤️🔥
Wishing the super talented and National Award winning actress a very Happy Birthday ❤️
Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/RyNCbXioXl
— SLV Cinemas (@SLVCinemasOffl) October 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

