Varasudu | ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా?
Varasudu First Single | ఈ ఏడాది 'బీస్ట్'తో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న విజయ్.. 'వారసుడు' సినిమాతో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి.
Varasudu First Single | ఈ ఏడాది ‘బీస్ట్’తో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న విజయ్.. ‘వారసుడు’ సినిమాతో ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొల్పాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్లు రావడం లేదు. దాంతో విజయ్ ఫ్యాన్స్ మేకర్స్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారసుడు సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ దీపావళికి రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్ తాజాగా దివాళి అంటూ ఓ ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు. దాంతో వారసుడు ఫస్ట్ సింగిల్ దిపావళికి రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సిఉంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

