Nani Next Movie | నేచురల్ స్టార్ నాని ఫలితం ఎలా ఉన్న వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన అంటే సుందరానికీ రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఈ సినిమాకు మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ వచ్చిన, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ఒక భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో నాని తన జానర్‌ను వదిలేసి ‘దసరా’ వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ కథతో ప్రేక్షకులు ముందుకు రావడనికి సిద్ధమయ్యాయి. ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలా ఉంటే నాని తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
దసరా సెట్స్‌పైన ఉండగానే నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ.. నానికి బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఇప్పటికే నాని 5 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. ఇప్పుడు మరో కొత్త దర్శకుడుని తన నెక్ట్స్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ప్రస్తుతం నాని నటిస్తున్న ‘దసరా’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. మొదటి సారి నాని ఫుల్ లెంగ్త్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో నాని అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లోనైనా లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనైనా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
తమిళనాట సంచలనం సృష్టిస్తున్న ‘PS-1’.. ఆ ఘనత సాధించిన తొలి సినిమాగా సరికొత్త రికార్డు
Kantara Movie | ‘కాంతారా’ మూవీ సరికొత్త రికార్డు.. తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి..!
Geeta Singh | కమెడియన్ గీతా సింగ్ అన్ని కోట్లు నష్టపోయిందా?
Varasudu | ‘వారసుడు’ ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడేనా?