Kantara Movie Creates New Record | కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న సినిమా ‘కాంతారా’. ఎలాంటి అంచనాల్లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఇప్పటికే 100కోట్ల మార్కును టచ్ చేసి.. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ దిశగా పరుగులు తీస్తుంది. కాగా ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. భారీ అంచనాల నడుమ శనివారం విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని హౌజ్ ఫుల్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఈ చిత్రం తాజాగా తెలుగులో నయా రికార్డు నెలకొల్పింది. రిలీజ్ రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. కాంతారా చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల వరకు బిజినెస్ అయింది. కాగా మొదటి రోజే ఈ చిత్రం రూ.2.2 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో రోజు కూడా భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇకపై వచ్చే కలెక్షన్లన్ని గీతాఆర్ట్స్‌కు ప్రాఫిట్సే. ఇక ఇదే జోష్ కంటిన్యూ అయితే ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రిషబ్‌శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించాడు. రిషబ్శెట్టికి జోడీగా సప్తిమీ గౌడ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. ఇక హిందీలో శుక్రవారం రిలీజైన ఈ చిత్రం గాడ్‌ఫాదర్ హిందీ వెర్షన్ కలెక్షన్లకు సమానంగా వసూళ్ళను సాధించింది.
Read Also:
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
Salaar Movie | ‘వర్ధరాజ మన్నార్’గా పృథ్విరాజ్ సుకుమారన్.. ఆసక్తికరంగా ‘సలార్’ పోస్టర్
Geeta Singh | కమెడియన్ గీతా సింగ్ అన్ని కోట్లు నష్టపోయిందా?
Mili Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..!