Salaar Movie | ‘వర్ధరాజ మన్నార్’గా పృథ్విరాజ్ సుకుమారన్.. ఆసక్తికరంగా ‘సలార్’ పోస్టర్
Prithiraj Sukumaran As Vardharaja Mannar | ఈ మధ్య కాలంలో మలయాళ హీరోలు ప్రతి భాషలో వాళ్ళ మార్కెట్‌ను పెంచుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్ తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోగా.. ఇప్పుడు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన పేరు దక్షిణాదిన మర్మోగిపోతుంది.
Prithiraj Sukumaran As Vardharaja Mannar | ఈ మధ్య కాలంలో మలయాళ హీరోలు ప్రతి భాషలో వాళ్ళ మార్కెట్‌ను పెంచుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే దుల్కర్ తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోగా.. ఇప్పుడు మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ అదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన పేరు దక్షిణాదిన మర్మోగిపోతుంది. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా పలు విభాగాల్లో పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘కడువా’ తెలుగులో కూడా రిలీజై మంచి విజయం సాధించింది. కాగా గత కొంత కాలంగా ఈయన ప్రభాస్ ‘సలార్’లో ఓ కీలకపాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రబృందం ఈ విషయంపై డైరెక్ట్‌గా ఎప్పుడూ చెప్పలేదు.
కాగా ఆదివారం ఈయన పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ బర్త్‌డే విషెన్‌ను తెలియజేసింది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ ‘వర్ధరాజ మన్నార్’గా నటించనున్నాడు. రీసెంట్గా విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. పోస్టర్‌ను గమనిస్తే పృథ్విరాజ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు తండ్రి, కొడుకుగా రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు సమచారం. ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా టీజర్‌ను దీపావళికి గాని, ప్రభాస్ బర్త్‌డేకు గాని రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
Mili Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..!
Geeta Singh | కమెడియన్ గీతా సింగ్ అన్ని కోట్లు నష్టపోయిందా?
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

