Mili Movie Trailer | అతిలోక సుందరి శ్రీదేవి తనయికగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటన, అభినయంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది జాన్వీ కపూర్. గతేడాది ‘రూహి’తో భారీ ఫ్లాప్‌ను మూటగట్టుకున్న జాన్వీ.. ఈ సారి ఎలాగైనా ‘మిలి’తో మంచి విజయం సాధించాలని కసితో ఉంది. సర్వైవర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘హెలెన్’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన మత్తుకుట్టి జేవియర్ రీమేక్ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ట్రయిలర్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతుంది. ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేసుకునే అమ్మాయి.. అనుకోకుండా ఫ్రిజర్ రూమ్‌లో ఉండిపోతుంది. మైనస్ డిగ్రీ సెల్సియస్‌లో 5 గంటల పాటు ఆ ఫ్రీజర్‌లో ఉంటుంది. ఆ 5 గంటలు తను బ్రతకాడిని ఎన్ని సాహసాలు చేసింది అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళంలో ఈ పాత్రలో అన్నాబెన్ నటించింది. ఈమె నటనకు కేరళ స్టేట్ అవార్డు వచ్చింది. కాగా అలాంటి కథతో జాన్వీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మించాడు. సర్వైవర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.