Kithakithalu Actress Geeta Singh | ‘కితకితలు’ సినిమాతో టాలీవుడ్లో మంచి పాప్యులారిటి తెచ్చుకుంది గీతా సింగ్. ఈ సినిమా తర్వాత గీతాసింగ్‌కు టాలీవుడ్లో భారీగానే అవకాశాలు వచ్చాయి. ‘శశిరేఖా పరిణయం’, ‘సీమ టపాకాయ్’, ‘కెవ్వు కేక’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి సినిమాలతో లేడి కమేడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంత కాలంగా ఈమె సినిమాల్లో కనిపించడం లేదు. చివరిగా ఈమె 2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో నటించింది. కాగా తాజాగా ఈమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వూ ఇచ్చింది. ఈ ఇంటర్వూలో తన కష్టాల గురించి చెప్పుకుంటూ బాధపడింది.
సినిమాల్లో కనిపించక పోవడంపై గీతా సింగ్ స్పందిస్తూ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, ఇతర ఇండస్ట్రీ నుండి కమెడియన్లు తీసుకువస్తున్నారని తెలిపింది. ఇక్కడ ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం కదా.. అవకాశాలు మాకు ఇవ్వండి అంటూ ఆవేధన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తనను అయినవాళ్లే మోసం చేశారని, ఒకరి దగ్గర చిట్టీలు వేస్తే.. అతను ఏకంగా 6 కోట్లు మోసం చేశాడని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల్లో అవకాశాలు రాకపోడంతో రెండు సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే తన ఫ్రెండ్స్ అండగా నిలబడటంతో తట్టుకోగలిగానని వెల్లడించింది.
Read Also:
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
Oridevuda Movie | ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పాన్ ఇండియా హీరో..!
RC16 | రామ్‌చరణ్ ‘RC16’కు దర్శకుడు దొరికేశాడా?
Mili Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న జాన్వీకపూర్ ‘మిలి’ ట్రైలర్..!