Oridevuda Pre-Release Event Guest | ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు విశ్వక్ సేన్. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అదే జోష్‌తో అరడజను సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘ఓరి దేవుడా’ ఒకటి. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఓమై కడువలే’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఒరిజనల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్‌గా జరుగనుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులలో మొదటి నుండి మంచి బజ్ ఏర్పడింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also:
Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
SDT15 | ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా పోస్టర్
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు దర్శకుడిగా ముందుగా సుకుమార్‌ను అనుకున్నారా..!