God Father Movie | ‘సైరా’, ‘ఆచార్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకుగా విడుదలైన మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే 50కోట్ల షేర్ మార్కును క్రాస్ చేసిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతుంది. ఈ చిత్రంలో చిరు పర్ఫార్మెన్స్కు అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా తెగ ఎంజాయ్ చేశారు. దానికి తోడు సత్యదేవ్ విలనిజం విపరీతంగా ఆకట్టుకుంది. మోహన్‌రాజా టేకింగ్, చిరును స్క్రీన్‌పై చూపించిన విధానానికి మెగా అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. కాగా ఈ సినిమాకు ముందుగా మరోక దర్శకుడిని చిత్రబృందం అనుకున్నారట.
ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా ఆయన మరెవరో కాదు క్రియేటీవ్ జీనియస్ సుకుమార్. చిరంజీవి అండ్ గాడ్‌ఫాదర్ నిర్మాతలు ముందుగా ఈ చిత్రాన్ని సుకుమార్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశారట. కానీ సుకుమార్ పుష్పతో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ మోహన్‌రాజా దగ్గరకు వెళ్ళింది. ఒకవేళ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించుంటే గాడ్‌ఫాదర్ ఇంకా పెద్ద హిట్టయ్యేది అంటు పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో నటించగా.. నయనతార కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Also:
Ahimsa Movie | నాని రిలీజ్ చేయనున్న ‘అహింస’ సెకండ్ సింగిల్..!
Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
SDT15 | ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్‌తేజ్ కొత్త సినిమా పోస్టర్
Naga Chaitanya | నాగచైతన్య తదుపరి సినిమా ఆ దర్శకుడితోనేనా?