Ponniyin Selvan-1 | ‘విక్రమ్’ రికార్డును బ్రేక్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్’..!
PS-1 Breaks Vikram Movie Record | గత కొన్నేళ్ళుగా కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మణిరత్నంకు 'పొన్నియన్ సెల్వన్' మంచి బ్రేక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధిస్తుంది. తమిళ సినీ చరిత్రలో నయా రికార్డులు సృష్టిస్తుంది.
PS-1 Breaks Vikram Movie Record | గత కొన్నేళ్ళుగా కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మణిరత్నంకు ‘పొన్నియన్ సెల్వన్’ మంచి బ్రేక్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధిస్తుంది. తమిళ సినీ చరిత్రలో నయా రికార్డులు సృష్టిస్తుంది. మణిరత్నం ఈ చిత్రాన్ని కల్కి కృష్ణమూర్తి రాసిని ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో మణిరత్నం టేకింగ్, నటీనటులు పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్ళను సాధిస్తుంది. కాగా తాజాగా ఈ చిత్రం ‘విక్రమ్’ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.
తాజాగా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం తమిళనాడులో ‘విక్రమ్’ సినిమాను దాటేసి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఇప్పటివరకు పొన్నియన్ సెల్వన్ తమిళనాడులో రూ.185 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక విక్రమ్ సినిమా రూ.172 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. అంతేకాకుండా తమిళ వెర్షన్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పొన్నియన్ సెల్వన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇదే జోష్ కొనసాగితే రోబో2.o షేర్‌ను కూడా బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు రిలీజ్ చేశాడు.
Read Also:
Ponniyin Selvan | ‘PS-1’ తమిళంలో హిట్టయింది.. కానీ మిగిలిన భాషల్లో?
Harry Potter Actor | ‘హ్యారీ పోటర్’ నటుడు మృతి
Prabhas | ప్రభాస్-మారుతి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?
Rajinikanth | 32 ఏళ్ళ తర్వాత మణిరత్నం-రజనీకాంత్ కాంబోలో మూవీ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

